రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు: సీపీ.

రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడు: సీపీ
నిజామాబాద్ సీపీ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని, అతనిపై ఎలాంటి కాల్పులు జరపలేదని సీపీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతోందని, వాస్తవాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు…నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరుపలేదు. ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారు. అదుపులోకి తీసుకున్నాం. తాము అదుపులోకి తీసుకోవడానికి ముందే ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో రియాజ్‌కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం రియాజ్‌కు చికిత్స అందిస్తున్నాం’ అని సీపీ పేర్కొన్నారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ను రియాజ్ కత్తితో పొడిచి చంపేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్‌ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బృందాలు ఏర్పడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అదుపులో ఉన్నట్లు సమాచారం..

సినీ ఫక్కీలో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అరెస్ట్

సినీ ఫక్కీలో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అరెస్ట్
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్‌ను పోలీసులు సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం కత్తితో పొడిచి పరారైన నిందితుడిని నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో డ్రోన్‌ల సహాయంతో పట్టుకున్నారు. మరో వ్యక్తితో జరిగిన గొడవలో గాయపడిన రియాజ్‌కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితడు ఎన్‌కౌంటర్‌లో హతమయినట్లు వస్తున్న వార్తలను సీపీ ఖండించారు. అతనిపై నిజామాబాద్ జిల్లాలో 40 కేసులున్నాయి.