తుఫాను హెచ్చరిక.. వచ్చే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!..

రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న నాలుగు రోజుల అనంతరం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..అక్టోబర్‌ 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్ర ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సమయంలో.. తాజాగా విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ తో యంత్రాంగం అప్రమత్తం అయింది..ప్రస్తుతం తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు (సోమవారం) బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

ఇక మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయి. బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్‌ 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో నేటి వాతావరణం ఇలా..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్ర ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది..