సూర్యాపేట జిల్లా…
మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం లోకి పులిచింతల ప్రాజెక్ట్ వరద నీరు..
కోరిన కోరికలు తీర్చే నరసింహస్వామి ఆలయ ప్రత్యేకతలు..
గర్భ గుడిలో స్వామికి ఎడమ ప్రక్కన ఒక గుహ ద్వారం వుంది. అక్కడనుండి సప్త ఋషులు, ఇతర మునులూ కృష్ణలో స్నానంచేసి స్వామి దర్శనానికి వస్తారుట. వాళ్ళు ఇప్పటికీ రోజూ వస్తారని ఇక్కడి వాళ్ళ నమ్మకం. స్వామికి కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్ధం తర్వాత కట్టింది. ఇదివరకు ఈయనను దేవతలు, మునులు మాత్రమే పూజించేవారుట. స్వామి మానవులకు కూడా దర్శనమియ్యాలని, ఒకరికి కలలో కనిపించి తన ఉనికిని చెప్పగా వారు బిలద్వారాన్ని తెరిచారుట..ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానంచేసి 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రంయొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే మట్టపల్లి స్వామివారే స్వయంగా చెప్పారుట. సంపూర్ణమైన విశ్వాసం మరియు భక్తితో ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కె తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు నేను తీరుస్తాను అని. ఇంకా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు వున్నవారు, సంతానము లేనివారు నా క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడుపూటలు కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో మీ అన్ని కోర్కెలు తీరుస్తాను అని చెప్పారుట. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు…
కరకట్ట గోడ లికేజీ ద్వారా దేవస్థానం లోకి వరద నీరు....
దేవస్థానంలోకి కృష్ణానది వరద నీరు లీకవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడంతో ప్రొటెక్షన్ వాల్ నుంచి నీరు లీక్ అవుతోంది. కాగా, నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణానదికి వచ్చిన భారీ వరదల్లో ఆలయం నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు కూడా వరదలు భారీగా వస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆలయ పూజారులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నదీ తీరాలలో స్వయంభువుగా వెలసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా మట్టపల్లి ఆలయానికి గుర్తింపు ఉంది..
ఎక్కడ లేని విధంగా కృష్ణానది ఒడ్డున పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం..
సుమారు వేయి సంవత్సరాల క్రితం కృష్ణానదీ తీరం లో మట్టపల్లి కి ఆవలి ఒడ్డున గల తంగెడ జనపదమును పాలిస్తున్న తన భక్తుడైన అనుముల మాచిరెడ్డి ప్రభువునకు స్వామి స్వప్న గోచరుడై, “వత్సా! సమీప కృష్ణానదీ తీరం లో ఒకానొక గుహాగర్భం లో నా స్వయంవ్యక్త మూర్తి మునిసుర బృంద సమర్చన లందుకుంటూ గుప్తం గా ఉంది. కలియుగం లో భక్తజన సంతరణకు నాదివ్యమూర్తి సుప్రకటితం కావలసి యున్నది.కావున ఉదయమే నీవు వెళ్ళి గుహాగర్భంలో ఉన్న నా రూపాన్ని లోకానికి సువ్యక్త పరచి ధన్యుడవు కమ్ము” అని ఆజ్ఞాపించాడు. ఆ అదృష్టశాలి మహానందభరితుడై లేచి, వేదపండితులను రావించి వారితో తన స్వప్నవృత్తాంతము ను వివరించినాడు. అతడు చెపితే విన్నవారై, వారు స్వామి ఆజ్ఞను శిరసావహించ వలసిందని మాచిరెడ్డి కి ఉద్బోధించారు. అనంతరం మాచిరెడ్డి విప్ర,పుర, పరి జన సమేతుడై, స్వామి ఆదేశానుసారం మట్టపల్లి వనానికి చేరి గుహలన్నీఅన్వేషించాడు.
32 ప్రదక్షిణాలు. :: ——- శ్రీ స్వామి వారికి 32 ప్రదక్షిణలు చేయడం ఇక్కడొక ఆచారం . మట్టపల్లి లో 11 రోజులు ఉండి, రోజూ మూడు పూటలా కృష్ణానది లో స్నానం చేస్తూ,32 ప్రదక్షిణలు చేస్తూ, మట్టపల్లి మంగళాష్టకాన్ని త్రిసంధ్యలలోను 11సార్లు పఠిస్తే భక్తులకు ఎటువంటి కోరిలున్నా తీర తాయని, ఎటువంటి మానసిక,శారీరక రుగ్మతలున్నానశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే” శ్రీ మట్టపల్లి నాథం ప్రణతోస్మి నిత్యం నమ: “ అనే మంత్రాన్ని 32 వేల సార్లు వ్రాస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయట. ఎటువంటిరుగ్మతలైనా మాయమవుతాయట. అంతేకాదు స్వామి వారికి కట్టే ముడుపు కూడ 32 రూపాయలే కట్టి హుండీలో వేయడం కూడ ఇక్కడ సంప్రదాయం…
ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముంపుబారినపడింది. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురికాకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్టనుంచి వరదనీరు లీకేజీ అయి ఆలయంలోకి చేరింది. ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభాన్ని చుట్టుముట్టింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. ఆలయంలోకి చేరిన నీటిని ధర్మకర్తలు,ఈఓ తెల్లవారేలోగా విద్యుత్ మోటార్లతో ఎత్తిపోసే పని చేపట్టారు..మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పులిచింతల ప్రాజెక్ట్ ముంపునకు గురైంది. ఆలయం ముంపు బారిన పడకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్ట నుంచి బుధవారం వరదనీరు లీకేజీ కావడంతో ఆలయంలోకి చేరింది. దీంతో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన శ్రీస్వామివారి భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంభూ స్వామివారిని ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కదిలించకుండా ఉండాలనే ప్రభుత్వం ఆలయంతో పాటు శివాలయం, అన్నదాన సత్రాల రక్షణకోసం ఆలయం చుట్టూ రూ.2కోట్లు, శివాలయం నుంచి ప్రహ్లాదఘాట్ వరకు రూ.4కోట్లు, అన్నదాన సత్రాలు, అతిథి గృహాల రక్షణ కోసం మరో రూ.6కోట్లు వెచ్చించి కరకట్టలు నిర్మించింది.
మూడు భాగాలుగా నిర్మించిన కరకట్టలో ప్రధానమైన ఆలయం చుట్టూ ఉన్న కరకట్ట (రక్షణగోడ) లీకేజీలు ఏర్పడి ఆలయంలోపలికి తెల్లవారుజాము నుంచి నీరు ప్రవేశించడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకున్న
పులిచింతల ప్రాజెక్ట్ లో నీరు 44 టీఎంసీ లు ఉండటం తో వరద నీరు వచ్చి చేరుతుంది.
పతి రోజు అధికారులు మోటర్ల ద్వారా నీటిని బయటకు తీస్తున్నారు.
ఇప్పుడు వున్న మోటర్ కాలిపోవడంతో నీటిని బయటకు పంపలేని పరిస్థితి ఏర్పడింది.
దేవస్థానం కి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
పాలకులు ఇప్పటికైనా స్పందించి నీటిని లోపలకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆలయం కి రక్షణ గా ఉన్న కరకట్ట గోడ కి 15 చోట్ల రంద్రాలు ఉండి వాటి ద్వారా నీరు రావడం తో దేవాలయం లో అడుగు మేర నీరు వచ్చి చేరిందని స్థానికులు తెలిపారు..
స్పందించిన పాలకమండలి..
ఆలయ ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్,
ఎప్పటినుంచో ఇలానే జరుగుతూ ఉన్న కరెంటు కొద్దిసేపైనా దాని తర్వాత మీరు ఆటోమేటిగ్గా మూడు అడుగుల మేర రావటం భక్తులందరినీ కలవరపెడుతుంది… సోమవారం రోజు జరిగిన ఘటన భక్తులలో కొంత ఆందోళన కలిగించింది.. వెంటనే పాలకమండలి స్పందించి నీళ్ల మోటార్లను సరిగతన ఏర్పాటు చేసి నీటిని బయటికి విడుదల చేశారు దీంతో ఆలయం ప్రాంగణంలో ఉన్న నీరు మొత్తం కూడా బయటికి పంపించడం జరిగింది..