రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్‌మెంట్‌ సెంటర్లు ఎక్కువ అయినవి… కేటీఆర్…

రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్‌ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వేల కోట్లు సంపాదిస్తే.. వందల కోట్లు సంపాదించుకోవడంలో మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్‌మెంట్‌ సెంటర్లు ఫుల్‌ అయ్యాయని, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాంత్రం నిల్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్‌ అధికారులు ఉద్యోగం చేసుకోలేక చేతులెత్తేసే పరిస్థివి వచ్చిందని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, మాఫియా రాజ్యమని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతి కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొడుతుంది…

తెలంగాణను మేము అగ్రికల్చర్‌లో అగ్రస్థానంలో నిలిపాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చింది. రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన ముఖ్యమంత్రిని చూడలేదు.