హైదరాబాద్ సిపి సజ్జనార్…..!
రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం..
ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది..
రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు.
రౌడీ షీటర్ మమ్మద్ ఉమర్ అన్సారి.. 20కి పైగా కేసు నమోదు అయ్యాయి.. రెండు పిడి యాక్ట్ లు నమోదు..
రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు..
దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్ మెన్ వచ్చారు.
దొంగ కత్తి తో గన్ మెన్ పై దాడి చేసాడు.
వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగ పై కాల్పులు జరిపారు.
దొంగకు చేతి పై.. కడుపు లో గాయాలయ్యాయి.
దొంగకు మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాము.
పరారీ లో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం.
రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం..
డీసీపీ స్వల్ప అస్వస్థత కు గురయ్యారు.. గాయలైన కానిస్టేబుల్ లు ఇద్దరూ ఆసుపత్రి లో క్షేమంగా ఉన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం.
మహమ్మద్ ఉమర్ అన్సారీ.. కేసులు.. నేరాలు.. అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తాం…
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని చాదర్ ఘాట్ (Chadar Ghat) లో కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో కాల్పులు జరిగిన విక్టోరియా ప్లే గ్రౌండ్కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ CP Sajjanar చేరుకున్నారు. సీపీతో పాటు క్లూస్ టీం అక్కడికి చేరుకుని, ఆధారాలను సేకరించింది.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. రౌడీలు, స్నాచర్స్పై ఉక్కుపాదం మోపుతామని సీపీ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు చాదర్ ఘాట్ విక్టోరియా మైదానం వద్ద జరిగినట్లు సజ్జనార్ తెలిపారు.
attacked DCP | నిందితుడిపై 20కి పైగా కేసులు..
ఇద్దరు రౌడీ షీటర్లు స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య వారిని పట్టుకునే ప్రయత్నం చేశారని సీపీ తెలిపారు. డీసీపీపై దాడి చేసిన రౌడీ షీటర్ పేరు మహమ్మద్ ఉమర్ అన్సారీ అని పేర్కొన్నారు.
అన్సారీ Mohammed Umar Ansari పై ఇప్పటికే 20కి పైగా కేసులు ఉన్నాయన్నారు. వీటిల్లో రెండు పీడీ యాక్టులు ఉన్నాయన్నారు. నిందితుడు రెండేళ్లు జైలులో ఉన్నట్లు సీపీ తెలిపారు.
దొంగను ఛేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ DCP Chaitanya తన గన్మన్తో వెళ్లినట్లు సీపీ తెలిపారు. కాగా, గన్మన్పై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆత్మరక్షణ కోసం డీసీపీ చైతన్య దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వివరించారు.
కాల్పుల వల్ల మహమ్మద్ ఉమర్ అన్సారీ చేతిపై, కడుపులో గాయాలైనట్లు చెప్పారు. నిందితుడిని మలక్పేట యశోద ఆసుపత్రి (Malakpet Yashoda Hospital) కి తరలించినట్లు సీపీ తెలిపారు.
అస్వస్థతకు గురైన డీసీపీ, గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీపీ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు. పారిపోయిన మరో దొంగ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు…
అతను రెండేళ్లు జైల్లో ఉన్నాడని తెలిపారు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్మన్తో వెళ్లగా.. దొంగ కత్తితో గన్మన్పై దాడి చేశాడని వివరించారు. ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ చైతన్య వెంటనే స్పందించి దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారని సజ్జనార్ స్పష్టం చేశారు. కాల్పుల కారణంగా దొంగ మహమ్మద్ ఉమర్ అన్సారీకి చేతిపై, కడుపులో గాయాలయ్యాయని, వెంటనే అతడిని మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించామని సీపీ తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప అస్వస్థతకు గురైన డీసీపీ, అలాగే గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు క్షేమంగా ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని, పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని, అలాగే మహమ్మద్ ఉమర్ అన్సారీకి సహకరిస్తున్న వారిని కూడా గుర్తిస్తామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.