రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ముసుగులో రౌడీ పాలన నడుపుతున్నరు. ముఖ్యమంత్రి, మంత్రులు అలీబాబా దొంగల్లా, దండుపాళ్యం ముఠాల్లా తయారై దోపిడీ పర్వానికి తెరలేపారు. పాలనను గాలికొదిలి వాటాల కోసం కొట్టుకుంటున్నరు. పారిశ్రామికవేత్తల కణతలపై గన్నులు పెట్టి మూటల పంపకాల్లో మునిగితేలుతున్నరు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ బాటిళ్లపై స్టిక్కర్ల కాంట్రాక్టు కోసం సీఎం రేవంత్ అల్లుడు, మంత్రి కొడుకు పోటీపడి ఓ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను బలిపశువు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అన్నదమ్ములు, అనుచరులు కలిసి రాష్ట్రాన్ని పంచుకొని దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరిట అర్రాస్పాట పాడి ఇప్పుడు నిధుల్లేవని సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేరాఫ్ అని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వడ్డెర, హోటల్స్ రెస్టారెంట్స్ అండ్ బేకర్స్ కార్మిక యూనియన్ల నాయకులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న వర్గాలకు అండగా ఉంటామని అభయమిచ్చారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్, వడ్డెర సంఘం మహిళా నేత జయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ తాతామధు తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకుదెరువుకు హైదరాబాద్‌కు వచ్చిన చిన్నాచితక కార్మికులు కాంగ్రెస్ పాలనలో చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో నిశ్చింతగా బతుకులు వెళ్లదీసిన వారు రేవంత్ హయాంలో అరిగోసపడుతున్నారని పేర్కొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.