వణికిస్తున్న మొంథా తుపాను.. !

అంతర్వేదిపాలెంలో మొంథా తీవ్ర తుపాన్ తీరాన్ని తాకింది. అలాగే, కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది. తుపాను ఎఫెక్ట్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉంది..జిల్లా వ్యాప్తంగా దుకాణాలు మూసివేశారు. తీరం దాటే వేళ గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మధ్య వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్‌ ఉంది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచించారు.

పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత ప్రజలను తరలించారు. APSDMA స్టేట్ కంట్రోల్ రూమ్: 112, 1070, 1800 425 0101కు సాయం కోసం ఫోన్ చేయొచ్చు. ‘మొంథా’ తుపాన్‌ ప్రభావంతో కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఏపీలోని తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి..మరోవైపు, కృష్ణా జిల్లా బందరు బీచ్ రోడ్‌లో ఈదురుగాలులు, భారీ వర్షాలతో పలు వృక్షాలు నేలకొరిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బందర్ నుంచి మంగినపూడి బీచ్‌కి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.

ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలపై ప్రైవేటు, వాణిజ్య వాహనాలపై నిషేధం విధించామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు, మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాల ప్రభావం ఉండే జిల్లాల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని అత్యవసర చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాల రాకపోకలను ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి నిలిపివేసినట్లు తెలిపారు..

చంద్రబాబు ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్..నారా లోకేశ్

నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా కరెంట్ స్టేటస్ ఏంటనేది తెలుసుకుంటున్నారు. సైక్లోన్ సమయంలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాల మేరకు పునరావాస చర్యలు చేపట్టాలి. ప్రజలను నేను ఒకటి కోరాలనుకుంటున్నాను. (Nara lokesh)

దయచేసి అందరూ మీ ఇళ్లలోనే ఉండండి. బీచుల వంటి ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడతాం. ఇప్పటికే మీడియా మిత్రులు కూడా ఈ విషయాల కవరేజ్ చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా న్యూస్ ఆర్టికల్స్ వేస్తున్నారు. నేను మానిటర్ చేస్తున్నాం పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. ప్రజలు కూడా టైం టు టైం అడ్వైజరీ తీసుకొని అది పాటించాలని మేము కోరుతున్నాం..ఈ టైమ్‌లో బయటికి వెళ్తామంటే అది కరెక్ట్ కాదు. బీచ్‌ల దగ్గరికి వెళ్తాం.. వీడియోలు చేస్తాం.. అంటే కుదరదు.. ఇది సరైన టైం కాదు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు గట్టిగా పడుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపాదికన కరెంట్ రిస్టోర్ చేస్తాం. దీనికే ప్రాధాన్యం ఇస్తున్నాం. గతంలో తుపానులు వచ్చిన సమయంలోనూ చేసి చూపించాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా అనుభవం ఉంది..

కొట్టుకుపోయిన ధాన్యం : మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొంగోడు కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోగా, నాయిని జలాల్పూర్, కొంగోడు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్ యజమానులు ఎలాంటి తరుగు లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పలు గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది.