_• నల్లగొండ జిల్లా లో తుఫాన్ ఎఫెక్ట్_
*🔹నల్గొండ జిల్లా స్కూల్స్ & అంగన్వాడీలకు సెలవును ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి*
• ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచన..
మొంథా” తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బుధవారం సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు.వర్షాల కారణంగా రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అధికారిక సూచనలను పాటించాలని, వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు..
*యాదాద్రి భువనగిరి జిల్లా*
* బీబీనగర్-పోచంపల్లి రాకపోకలు బంద్
* తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
* బీబీనగర్ – పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
* వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు వంతెన ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
* భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు….
నల్గొండ జిల్లా………
దేవరకొండలో బారీ వర్షం….
పొంగిపొర్లుతున్న వాగులు….
వరదలో చిక్కుకున్న దేవరకొండ మండలం కొమ్మేపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాల భవనం ..
వాగు సమీపంలో ఉన్న పాఠశాల
వరద చుట్టుముట్టడంతో భయాందోళనలో విద్యార్దులు..