బీబీనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!

బీబీనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి, పక్కనే నిల్చున్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, యువతి పక్కనే ఉన్న బీబీనగర్ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది.కారులోని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా జిల్లా ఆసుపత్రికి తరలించారు.