Letest news updates…. ప్రధాన వార్తలు..

పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి మద్యం కంపెనీల అల్టిమేటం

బకాయిలు చెల్లించకపోతే తెలంగాణలో మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక

రూ.3,366 కోట్ల బకాయిలు డిసెంబర్ లోపు చెల్లించాలని, లేకపోతే మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం.

పోలీస్ వాహనాలు శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్‌తో హోమ్ గార్డ్ మృతి

వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాలను శుభ్రం చేస్తుండగా, కరెంట్ షాక్‌కు గురయ్యి మృతిచెందిన హోమ్ గార్డ్ శ్రీనివాస్..

మృతుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామ వాసిగా గుర్తించిన పోలీసులు..

రైతులను నిండా ముంచుతున్న అకాల వర్షాలు

సూర్యాపేట జిల్లా,,వరంగల్ నగరంలో ఉదయం కురిసిన భారీ వర్షాలకు, ఎనుమాముల మార్కెట్లో పూర్తిగా తడిసి ముద్దయిన పత్తి, మొక్కజొన్న పంట

షెడ్ల కిందకి తరలించే సమయం కూడా లేకుండా ఒక్కసారిగా వర్షం పడడంతో పంట మొత్తం తడిసిందని రైతుల ఆవేదన..

తడిసిన పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న రైతులు..

*సూర్యాపేట జిల్లా* …

హుజూర్ నగర్, మఠంపల్లి మండలంలో భారీగా కురుస్తున్న వర్షానికి నేలకి ఒరిగిన వరి పైరు..

గతంలో జరిగిన భారీ పంట నష్టాన్ని ఇప్పటివరకు కూడా అంచనా వేయని అధికారులు…

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షంతో మరికొంత పొలం నేలమట్టం…

ఆందోళనలో రైతులు..

చేతికొచ్చిన పంట వరద పాలు….

వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. పలువురికి గాయాలు

వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులను పరామర్శిస్తున్నారు. అయితే, జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.
ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలాఉంటే.. దారిపొడవునా జగన్‌కు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత కూడా జగన్ పర్యటన సాగిన ప్రాంతాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు..

చాట్జీపీటీ యూజర్లకు గుడ్న్యూస్. ఓపెన్ఏఐ నేటి నుంచి భారత్లోని వినియోగదారులకు “ChatGPT Go” ప్లాన్ను పూర్తి ఉచితంగా అందిస్తోంది. దీంతో ఇప్పుడు భారతీయ వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ రుసుము చెల్లించకుండానే అధునాతన AI ఫీచర్‌లను ఉపయోగించుకోగలరు. ఈ ఆఫర్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది.

గతంలో ఈ ప్లాన్ నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లకు అందుబాటులో ఉండేది. భారతదేశం ఓపెన్ఏఐకి రెండవ అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో కంపెనీ తన AI టూల్స్ను ఇక్కడ విస్తరించే దిశగా ఈ చర్య తీసుకుంది. విద్య, వ్యాపారం, కోడింగ్, సృజనాత్మక ప్రాజెక్టుల కోసం చాట్జీపీటీని ఉపయోగించే లక్షలాది మంది భారతీయులకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది.

ఓపెన్ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలో AI వినియోగాన్ని ప్రోత్సాహిస్తుంది. ఈ ప్లాన్ ప్రభుత్వ “ఇండియా AI మిషన్‌”కు అనుగుణంగా ఉందని, ఇది పరిశ్రమలలో AI అక్షరాస్యత, ఆవిష్కరణలను పెంచుతుందని కంపెనీ తెలిపింది. ఓపెన్ఏఐ విద్య, పౌర సంస్థలతో కలిసి పనిచేస్తూ మెట్రో నగరాలకు మించి గ్రామీణ ప్రాంతాలకూ AI చేరుకోవడంపై దృష్టి సారిస్తోంది..

షట్‌డౌన్‌తో సిబ్బంది కొరత.. అమెరికాలో స్తంభించిన విమాన సేవలు.

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ (US shutdown) ప్రభావం విమాన సర్వీసులపై (flight delays) తీవ్రంగా పడింది. ఈ షట్‌డౌన్‌ కారణంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు, టీఎస్‌ఏ స్క్రీనర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. దీంతో ఎయిర్‌పోర్ట్స్‌లో సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది.

డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్

డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసులు ఓ డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న ఈ పార్టీపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్‌తో పాటు, డ్రగ్స్ సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ, మరో నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు…..