*🔹తెలంగాణకు చలి హెచ్చరిక!*
_• నవంబర్ 11 నుండి 19 వరకు (ప్రధానంగా 13 నుండి 17 నవంబర్ వరకు) 8-10 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది._
_• పింక్ కలర్లో సూచించిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ (10°C కంటే తక్కువ) వరకు పడిపోవచ్చు..
_• బ్లూ కలర్ జిల్లాలు (హైదరాబాద్ సహా) ఉదయపు ఉష్ణోగ్రతలు 11°C–14°C మధ్య ఉండే అవకాశం ఉంది.
_• ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C–17°C మధ్య ఉండవచ్చు._
_• సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత తరచుగా ఉండదు, కానీ ఈ సంవత్సరం 8-10 రోజుల పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండ బోతోంది!..
తెలంగాణలో వానలు తగ్గి చలి మొదలైంది. నవంబర్ 10 నుంచి చలి తీవ్రత పెరుగుతుందని.. రాత్రి ఉష్ణోగ్రతలు 9-14 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మిగతా వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు…శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.7 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా షాబాద్లో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జహీరాబాద్లో 14.7 డిగ్రీల సెల్సియస్, శంకర్ పల్లి 14.9 డిగ్రీల సెల్సియస్, మొయినాబాద్ 15.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో రాజేంద్రనగర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH)లలో అత్యల్పంగా 15.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బీహెచ్ఈఎల్ 15.5 డిగ్రీల సెల్సియస్ మల్కాజ్గిరి 15.7, గచ్చిబౌలి 15.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు…