రసాయనాలు, రైఫిళ్లతో 4 రోజుల్లో 4 మంది వైద్యుల అరెస్టు: వైట్ కాలర్ ఉగ్రవాదం ముఖం..
గత వారం రోజులుగా ఆందోళన కలిగించే వరుస అరెస్టులలో, రెండు వేర్వేరు సంఘటనలలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులు మరియు అనేక మంది ఇతర సహచరులను అధికారులు అరెస్టు చేశారు , ఇది ప్రొఫెషనల్ సర్కిల్ల నుండి పనిచేస్తున్న పెరుగుతున్న వైట్-కాలర్ టెర్రర్ పర్యావరణ వ్యవస్థను బహిర్గతం చేసింది.
ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ & కాశ్మీర్లలో జరిగిన ఈ అరెస్టులలో ఒకదానితో పాటు 2,900 కిలోలకు పైగా బాంబు తయారీ సామాగ్రి, రైఫిల్స్, పిస్టల్స్ మరియు ఇతర అనుమానాస్పద పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో జరిగిన ఇతర అరెస్టులలో విషాన్ని తయారు చేసే పదార్థం మరియు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు..
భారతదేశంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ లే వేశారు. దీని కోసం పెద్ద నగరాలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో పేలిన కారు బాంబే ఇందుకు నిదర్శనం దీని తరువాత ఫరీదాబాద్ లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడడం ద్వారా మరిన్ని ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఫ్లానే బయటపడింది.
నీళ్ళు, ప్రసాదాల్లో విషం..
తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఒక హైదరాబాద్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మోహియుద్ధీన్ ను అరెస్ట్ చేశారు. ఇతను హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్ర నగర్ సర్కిల్ ఫోర్ట్ వ్య కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్…చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పని చేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో పాకిస్తానీహ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో రిసిన్ ఒకటి. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎందులో కలిపినా ఎవరూ గుర్తుపట్టలేరు. చివరకు నీళ్ళల్లో కలిపినా కూడా తెలియదు. అందుకే ప్రజలను చంపేందుకు దీనిని ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అందరికీ సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి రిసిన్ ను తయారు చేస్తున్నారు. దీనిని దేశంలోని ప్రధాన నగరాల్లో మంచి నీళ్ళు, గుడి ప్రసాదాల్లో కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు డాక్టర్ సయ్యద్ మొహయుద్దీన్. విషాన్ని ఇవ్వడం ద్వారా దేశంలో వేలాది మంది మరణించేలా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీతోపాటూమరి కొన్ని చోట్ల బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత జమ్మూ-కాశ్మీర్ పోలీసులుఅప్రత్తంఅవండంతోమితా వాటిని జరగకుండాఆపగలిగారు. ఈ క్రమంలో నిషేధిత జైషే మహ్మద్, అన్సార్గజ్వత్ ఉల్ హింద్ఉగ్రసంస్థలతోసంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు.అదీల్ అహ్మద్,ముజమ్మిల్షకీల్,షాహిన్ ల దగ్గర నుంచిపలుడుకుసంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం.హరియాణాలోనిఫరీదాబాద్ లోపేలుడికిసబంధించిఅమ్మోనియంనైట్రేట్, పొటాషియంనైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన పేలుడు పదార్థాలు భారీ ఎత్తున పోగుచేశారు. ఇది దాదాపు 3 వేల కేజీలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.