🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🪴పంచాంగం🪴
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 13 – 11 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : *నవమి* తె3.31 వరకు,
నక్షత్రం : *మఖ* రా12.22 వరకు,
యోగం : *బ్రహ్మం* మ12.38 వరకు,
కరణం : *తైతుల* మ3.46 వరకు,
తదుపరి *గరజి* తె3.31 వరకు,
వర్జ్యం : *మ12.20 – 1.56*
దుర్ముహూర్తము : *ఉ9.51 – 10.36*
మరల *మ2.21 – 3.06*
అమృతకాలం : *రా9.58 – 11.34*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండం : *ఉ6.00 – 7.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం : *6.07*
సూర్యాస్తమయం : *5.21*
*_నేటి మాట_*
*ఈ మాయా ప్రపంచంలో దేన్నీ విశ్వసించాలి???*
ఈరోజు మనమంతా సృష్టిలో ఉండే ప్రతీ వస్తువును ఎంతో ప్రేమిస్తున్నాము, కానీ సృష్టించిన సృష్టి కర్తను మరిచిపోతున్నాము, ముఖ్యంగా దైవాన్ని విశ్వసించాలి.
మానవత్వం లో ఎంతో విచిత్రమైన శక్తి ఉన్నది, భగవంతుని సృష్టి యే మహా విచిత్రమైనది.
ఒక మానవుని వలె మరొక మానవుడు లేడు.
ఒక వేలి ముద్ర వలె మరొక వేలి ముద్ర లేదు, అంతా విచిత్రంగా ఉంటున్నది.
భగవంతుని సృష్టి ఒక మౌల్డ్ తో చేసేదికాదు, లేక ఒక రబ్బరు స్టాంపు తో చేసేదికాదు.
ఇది క్షణక్షవమునకూ మార్పు కలిగే టటు వంటిది.
విభిన్న మైన రూపనామములను ధరించేటటువంటిది.
కవలపిల్లలయందు కూడా, ఏదో వ్యత్యాసం ఉండే తీరుతుంది, ఇంత విచిత్రమైనది భగవత్ సృష్టి.
మన హృదయంలో భగవంతుడు తప్ప మరొకడు ఉండకూడదు, భార్యా భర్తల మధ్య, తల్లీ పిల్లల మధ్య, అన్న దమ్ములమధ్య ఉండేది దేహ సంబంధమే కానీ హృదయసంబంధముకాదు.
ఈసంబంధాలన్నీ మధ్య లో వచ్చి మధ్య లో పోయేవే!
నీవు పుట్టక ముందు, పుట్టిన తరువాత మరణించిన తరువాత కూడా నీ వెంట దేవుడే ఉంటున్నాడు.
ఇతడుసర్వవ్యాపి, ఆయన లేని స్థలం ఉండదు.
కనుక ఇట్టి నిత్య సత్యమైన దైవాన్ని విశ్వసించాలి.
*_🪴శుభమస్తు🪴_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏