తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ..!

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత
పిటీషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్ సభ్యత్వం రద్దు చేయటంతో తెలంగాణలో 10 ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది..