స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం.
డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.
_• ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు._
*• డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు.*
_• ఈనెల 24 న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పిటిషన్ పై విచారణ._
_• దానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల పై నిర్ణయం..
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 నెలలుగా స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో.. ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రివర్గం (Telangana Cabinet) సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది…ప్రభుత్వం తొలుత డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించనుంది. ఈ వారోత్సవాల్లో కొత్త సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం.. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది..
సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్ట పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
మరణించిన వారికి అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయాలని, మృతుల కుటుంబాల నుండి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రుల కేబినెట్
మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన బృందాన్ని సౌదీ అరేబియా పంపించాలని నిర్ణయించిన మంత్రి వర్గం..