మంత్రి సీతక్క పై రైతుల ఆగ్రహం..
మీరు అసలు రైతులేనా , మీ చొక్కా చూస్తే అర్థమవుతుంది అంటూ మాట్లాడి వెళ్లిపోయిన సీతక్క..
https://www.facebook.com/share/v/1JV4YFoq2Y/
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క కాన్వాయిని ఆపి , బోనస్ ఇవ్వాలని, సకాలంలో పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన రైతులు..
అసలు మీరు రైతులేనా అంటూ దురుసుగా ప్రవర్తించి, పోలీస్ బందోబస్తు నడుమ అక్కడినుండి వెళ్లిపోయిన వెళ్లిపోయారు.. ఏమైనా మాట్లాడేది ఉంటే సభ దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటూ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు మంత్రి.. దీంతో కోపంగా రైతులు బోనస్పై మాట్లాడితే సమాధానం ఇవ్వకుండా పోవడం ఎంతవరకు కరెక్టు మంత్రి గారు ఆలోచించుకోండి అంటూ సమాధానం ఇచ్చారు… రైతులతో మాట్లాడుతున్న సమయంలో పక్కనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ కూడా ఉన్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.