స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడితేనే, ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయి…
కేంద్ర బిజెపి, ఏపీ సీఎం చంద్రబాబు , తెలంగాణ సీఎం రేవంత్ తో సహా అందరూ తెలంగాణ వ్యతిరేకులే..
సూర్యాపేటలో జరగనున్న దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి.. ఒంటెద్దు నరసింహారెడ్డి* ..
*సూర్యాపేట జిల్లా…. మఠంపల్లి లో brs పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం….
ముఖ్య అతిథిగా హాజరు అయినా నియోజకవర్గం సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి… పాల్గొన్న brs సీనియర్ నాయకులు KLN రెడ్డి…
మన్నెం శ్రీనివాస్ రెడ్డి… మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్..
brs పార్టీ మండల అధ్యక్షులు పిచ్చయ్య…పార్టీ నాయకులు బాలాజీ నాయక్..కోట…
రమణ. తదితరులు…ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ప్రజలకి అన్ని పథకాలు అద్దుతాయి..
వడ్లకి బోనస్ కావాలన్నా,, ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా,, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అన్ని పథకాలు అమలు అవుతాయని,, వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కనీసం ఒక్క పథకాన్ని కూడా సరైన పద్ధతిలో అమలు చేయకుండా ప్రజలని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుందని అన్నారు..
కెసిఆర్ చచ్చుడు తెలంగాణ ఒచ్చుడో అని రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏకైక మహనీయుడు మాజీ సీఎం కేసీఆర్ అని అన్నారు…
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పూర్తి వ్యతిరేకి అని ఆరోపించారు..
నాడు జై తెలంగాణ అనని వ్యక్తి నేడు సీఎంగా ఉన్నాడని.. తెలంగాణ నీటి వాటాన్ని అడ్డుకున్న వ్యక్తి ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అడ్వైజర్ గా ఉన్నారని అన్నారు…
అధికార మదంతో అక్రమ కేసులు పెట్టిస్తూ అమాయకులని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగేటప్పుడు, యూరియా కొరతని గుర్తుచేయాలని అన్నారు.
పోయినసారి వడ్ల కొనుగోలు బోనస్ ని గుర్తు చేయాలని అన్నారు..
ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు..