సిక్సుల్లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ.

సిక్సుల్లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ.

398 మ్యాచుల్లో 351 సిక్స్‌లు కొట్టిన అఫ్రిది
277 మ్యాచుల్లోనే అఫ్రిది రికార్డు దాటేసిన రోహిత్..

టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటి నుంచి సౌతాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్(Rohit Sharma) ఓ అరుదైన రికార్డుకు అత్యంత అరుదైన రికార్డు చేసిన రోహిత్..

భారత్, సౌతాఫ్రికా మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీర విహారం చేస్తున్నారు. ఆదిలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత, క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన మెరుపు హాఫ్ సెంచరీతో రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ హాఫ్ సెంచరీలను నమోదు చేయడంతో పాటు, కొన్ని కీలకమైన రికార్డులను సమం చేశారు, అధిగమించారు..