సర్పంచిగా పోటీ చేయమని కాళ్లపై పడిన వ్యక్తి…!

పల్లెలు అంటేనే దేశానికి పట్టుగొమ్మలు అంటారు. అలాంటి గ్రామాలను కాపాడుకోవడానికి ఒక్కో గ్రామానికి ఒక్కో పెద్ద ఉంటారు. అతడినే సర్పంచి అంటారు. ఆ సర్పంచి పదవి కోసం ఒక మినీ యుద్ధమే చేయాలి. అంతేగానీ అంత ఆషామాషీగా గ్రామ ప్రథమ పౌరుడు పోస్టు రాదు. ఇందుకు ఒక ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకొని నామినేషన్ వేయిస్తే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటర్లు అతడిని గెలిపించాలి. ఒకవేళ గెలవకపోతే అతడి పరువు పోతుందని అతడు భావిస్తాడు.

గ్రామ సర్పంచి పదవి కోసం ఎన్నికల సమయాల్లో చిత్రివిచిత్రాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సర్పంచి ఎన్నికలను గ్రామాల్లో తీసుకుంటారు. ఓడిపోతే ప్రాణం పోతుందన్న పంతంతో చాలా మంది అభ్యర్థులు పోటీని రసవత్తరం చేస్తున్నారు. కొందరైతే ఏకగ్రీవం కావడానికి డబ్బులను ఆశగా చూపితే, మరికొంత మంది ఎన్నికల్లో పోటీ చేసి పీఠాన్ని దక్కించుకుంటున్నారు. తాజాగా వీడియోలో మాత్రం ఓ వ్యక్తి ఆమెను అభ్యర్థిగా పోటీ చేయమని కాళ్లపై పడి వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది..
సర్పంచిగా పోటీ చేయమని కాళ్లపై పడిన వ్యక్తి : ఓ వ్యక్తి మహిళ కాళ్లపై పడి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం ఓటు కోసం కాదు. ఆమె సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడాలంటూ వేడుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామానికి జనరల్ మహిళకు సర్పంచ్గా అవకాశం వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి కొమ్మినేని రాములమ్మను అదే గ్రామానికి చెందిన ఓ అభిమాని ఆమె కాళ్లపై పడి సర్పంచ్గా పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.