తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు..

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు

TG: రాజభవన్ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజ్భవను ‘లోకభవన్’గా మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది….తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం ‘రాజ్‌భవన్, తెలంగాణ’ ఇకపై ‘లోక్‌భవన్, తెలంగాణ’ అని పిలవబడుతుందని తెలిపింది.

వికసిత్ భారత్ వైపు ముందుకు సాగుతున్న సమయంలో.. మనదేశ ప్రజాస్వామ్య విలువల బలాన్ని, చైతన్యాన్ని పునరుద్ఘాటించడానికి ఈ నిర్ణయం తీసుకోబడిందని పేర్కొంది. సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లలో తక్షణమే ఈ మార్పు అమల్లోకి వస్తున్నట్టు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి..