కిలౌయా అగ్నిపర్వతం మళ్లీ విస్ఫోటనం..!

కిలౌయా అగ్నిపర్వతం మళ్లీ విస్ఫోటనం
హవాయిలోని కిలౌయా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. 100 అడుగుల ఎత్తు వరకు లావా చిమ్ముతోంది. ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటైన కిలౌయా విస్ఫోటనం ఏడాది క్రితం (2024 డిసెంబర్ 23న) ప్రారంభమైంది. ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం 38 సార్లు బద్ధలైంది.ప్రస్తుతం సుమారు 50-100 అడుగులు (15-30 మీటర్లు) ఎత్తులో నిరంతర లావా ఎగసిపడుతోంది. ప్రభావితమయ్యే అంశాలేవి లేవని అధికారులు తెలిపారు…