అమరావతి- ఇండిగో సంక్షోభంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..!

అమరావతి- ఇండిగో సంక్షోభంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటెషన్ నిబంధనలు అమలు చేశారు
* విమాన ప్రయాణికుల భద్రత పెంచటంలో భాగంగా పైలట్లు, క్రూ సభ్యులకు విశ్రాంతి సమయం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు పెట్టింది.
* ఇండిగో సంస్థ సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
* జరిగిన పరిణామాలపై కేంద్రం చర్యలు తీసుకుంటోంది… పరిస్థితిని చక్కదిద్దుతోంది…

దేశవ్యాప్తంగా ఇటీవల ఇండిగో సంక్షోభం(IndiGo Crisis)పై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) స్పందించారు. ఇండిగో సంస్థలో పైలట్ల అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పైలట్లకు తగినంత విశ్రాంతి అవసరమని చెప్పారు. కానీ, ఇండిగో అలాంటి ప్రమాణాలేవీ పాటించలేదన్నారు. ఆ సంస్థకు ప్రత్యేకంగా సమయమిచ్చినా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు సీఎం. ఫలితంగా.. దేశవ్యాప్తంగా వందల కొలదీ విమానాలు రద్దయ్యాయనీ.. వేల మంది ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు…దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ విషయమై.. ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పినప్పటికీ అది అసౌకర్యంగానే కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం(Central Govt) రంగంలోకి దిగడంతో.. ఆ సంస్థ ఈ సంక్షోభం నుంచి మెల్లగా బయటపడుతోందన్నారు. అయితే.. ఈ విషయమై తాను మానిటరింగ్(Monitoring) చేయలేదని ముఖ్యమంత్రి చెప్పారు. సంబంధిత మంత్రి దీనిపై చర్చించి ప్రధాని, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఇండిగో మోనోపాలి(ఏకచ్ఛత్రాధిపత్యం) వల్లే ఈ సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది…