95 ఏండ్ల పోరాట స్ఫూర్తికి జైకొట్టిన ప్రజా ప్రభంజనం..
దీంతో సొంతూరుకు సర్పంచ్ గా సేవచేయాలనుకున్న కళ సాకారమైంది..
నేటి యువతతో బరిలో దింపించి.. మెజార్టీతో గెలిపించిన జనం..
95 ఏండ్ల నవయువకుడికి ఈ మధురానుభూతి మరువలేనిది..
స్థానిక సమరంలో అందరిచూపు నాగారం వైపే అన్నట్టు సాగింది..
రాష్ట్ర రాజకీయాల్లోనే గుంటకండ్ల రామచంద్రా రెడ్డి ఎన్నిక రసవత్తరంగా మారింది..
వందేండ్లకు చేరువైనా పోటీలో నిలబడటమే ఒక రికార్డ్.. గెలుపొందడం మరో రికార్డు..
మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి రాంచంద్రారెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ పదవి కోసం రాంచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. 95 ఏండ్లు ఉన్న రాంచంద్రారెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది…రాష్ట్రంలో అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్ క్యాండిడేట్‌గా రాంచంద్రారెడ్డి నిలిచారు. కాగా, తనను గెలిపిస్తే వయసుతో సంబంధం లేకుండా.. యువకుల కంటే ఎక్కువగా ఉత్సాహంగా పనిచేస్తానని రాంచంద్రారెడ్డి చెప్పారు…
అన్నట్లుగానే గెలిచి చూపించారు..
*నాగారంలో బాపూ గెలుపు..*
సర్పంచ్ గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి.
విజయం రాజకీయ చరిత్రలోనే సంచలానాత్మకమైన ఓ సరికొత్త రికార్డు..
స్థానిక సంగ్రామంలో 95 ఏండ్ల నవ యువకుడి విజయకేతనం..
బాపూ అని పిలుచే నాగారం.. సర్పంచ్ గా నిలిపి గెలిపించుకున్న ప్రజనీకనికి కృతజ్ఞతలు తెలిపారు..