తెలంగాణ సర్పంచ్ మొదటి విడత ఎన్నికల ఫలితాలు అప్డేట్..
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
జిల్లాల వారీగా తొలి విడత పోలింగ్ వివరాలు ఇవే
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ 82.26 శాతం
జనగామ జిల్లాలో పోలింగ్ 78.57 శాతం
ఆసిఫాబాద్ జిల్లాలో 77.07 శాతం
పెద్దపల్లి జిల్లాలో శాతం 82.27 శాతం
సంగారెడ్డి జిల్లాలో 84.71 శాతం
హనుమకొండలో 81.39 శాతం
నల్లగొండ జిల్లాలో 81.63 శాతం
ఖమ్మం జిల్లాలో 86.95 శాతం
సూర్యాపేట జిల్లాలో 89.69 శాతం
మహబూబ్ నగర్ జిల్లాలో 83.04 శాతం
మహబూబాబాద్ జిల్లాలో 86.99 శాతం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 78.58 శాతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం.
ఈరోజు వెలువడిన ఫలితాలు ఇప్పటివరకు
కాంగ్రెస్ 816
బీఆర్ఎస్ 464
బీజేపీ 89
ఇతరులు 205
ఏకగ్రవంగా ఎన్నుకున్న స్థానాలు
కాంగ్రెస్ 303
బీఆర్ఎస్ 47,
బీజేపీ 6
ఇతరులు 39
మొత్తంగా
కాంగ్రెస్ – 1119
బీఆర్ఎస్ – 511
బీజేపీ – 95
ఇతరులు – 244..
ఒక్క ఓటు తేడాతో పరందోలి స్వతంత్ర అభ్యర్థి పుష్పలత గెలుపు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై గెలుపొందారు.
ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఎదురుదెబ్బ..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఎదురుదెబ్బ.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం..
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై84 ఓట్ల తేడాతో విజయం.
3 వార్డులలో బీఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు…
ఓటమి తట్టుకోలేక.. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి!.
వికారాబాద్‌లో కొండగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచి అభ్యర్ధిగా పోటీ చేసిన ఓటమి లక్ష్మి ఓటమి పాలైంది. దీంతో ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి పురుగుల మందు తాగింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాల్లో 115 గ్రామాలు ఉండగా .
ఏకగ్రీవాలు: 12
పోటీలో ఉన్నవి : 103 గ్రామాలు.
సాయంత్రం 7 గంటల వరకు వివిధ పార్టీలు గెలిచిన స్థానాలు..
బీఅర్ ఎస్: 17
కాంగ్రెస్: 20
బీజేపీ: 04
ఇండిపెండెంట్: 05..
భద్రాద్రి కొత్తగూడెం:
చర్ల మండలం తెగడ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి జమ్ముల కృష్ణ మురళి విజయం..
లక్కీ డ్రా తీసిన అధికారులు..
యాదాద్రి జిల్లా: లక్కీ డ్రా తీసిన అధికారులు..
రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సమానంగా పోలైన ఓట్లు…
బీఆర్‌ఎప్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు .. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి సైతం 148 ఓట్లు
లక్కీ డ్రా తీసిన అధికారులు…బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్య గెలుపు..
కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి స్వగ్రామంలో రీకౌంటింగ్..!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో BRS అభ్యర్ధి రేవతికి 6 ఓట్లు ఆధిక్యం రావడంతో రీకౌంటింగ్ చేయాలని ప్రత్యర్థి డిమాండ్ చేశారు. దీతో పోలింగ్ అధికారులు రీకౌంటింగ్ చేస్తున్నారు..
మహబూబ్‌నగర్ జిల్లాలో BRS అభ్యర్ధుల హవా.
మహబూబ్‌నగర్ జిల్లాలో పలు చోట్ల BRS అభ్యర్ధులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్‌ఎస్ అభ్యర్ధి సోమ్లా, మహబూబ్‌నగర్ తువ్వగడ్డ తండాలో చాందిని శంకర్ గెలుపొందారు. అలాగే రాజాపూర్ మండలంలోని రాఘవపూర్, దోండ్లపల్లి, చొక్కం పేట్, కుతినేపల్లి, కోర్ర తండా, రంగారెడ్డి పల్లి, లాల్యా నాయక్ తండ, వెల్డండ మండలం పోతేపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలుపొందారు..
ఆదిలాబాద్ జిల్లాలో గెలుపొందిన అభ్యర్ధులు వీరే
ఆదిలాబాద్ జిల్లాలో..
ఇచ్చోడ మండలం అడేగామ కే గ్రామంలో అనూష.
ఉట్నూర్ మండలం లింగోజీతాండాలో జాదవ్ మాయ హరినాయక్.
పులిమడుగులో అడె లిలాబాయి
కోత్తగూడ ( G)లో తోడసం బీంబాయి (ఇండిపెండెంట్).
కన్నాపూర్‌లో నైతం దైర్యవంతి (ఇండిపెండెంట్)
నాగపూర్‌లో కల్పణ సునీల్
నడ్డంగూడలో చౌవన్ సుశీల బాయి.