గల్ఫ్ దేశాలతో తన ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఒమన్తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఒమన్ ఒక దేశంతో కుదుర్చుకుంటున్న రెండో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాత్రమే కాకుండా, గత 20 ఏళ్లలో వారు చేస్తున్న మొట్టమొదటి ఒప్పందం కావడం గమనార్హం. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. విశేషం ఏమిటంటే.. ఒమన్ దేశం గత 20 ఏళ్లలో ఇలాంటి ఒక పెద్ద ఒప్పందాన్ని చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులు ఒమన్ మార్కెట్లోకి ఎటువంటి అదనపు పన్నులు లేకుండా లేదా తక్కువ పన్నులతో వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన దేశంలోని రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు భారీ లాభాలు చేకూరుతాయి. అలాగే పెట్టుబడులు పెరగడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్న వేళ వస్తువుల సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు ఈ స్నేహపూర్వక ఒప్పందం ఎంతో కీలకం..
వరుస ఒప్పందాలతో భారత్ జోరు
గడిచిన నాలుగేళ్లలో భారత్ అనేక దేశాలతో ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. అవి మన ఆర్థిక వ్యవస్థకు ఎలా తోడ్పడుతున్నాయంటే:
బ్రిటన్ (2025): 90 శాతం వస్తువులపై పన్నులు తగ్గడం వల్ల మన వ్యాపారం విస్తరించింది..