5వ టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. సౌతాఫ్రికాను కట్టడి చేశారు..తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. 232 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. బుమ్రా 2 వికెట్లతో రాణించాడు. అర్ష్‌దీప్‌సింగ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.
భారత జట్టులో తిలక్ వర్మ(73), హార్దిక్ పాండ్యా(63) హాఫ్ సెంచరీలో చెలరేగారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా మెరుపు బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోర్ చేసింది..
మరోవైపు హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించడంతో భారత్ 231 పరుగుల పర్వతాన్ని నిలబెట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37), సంజూ శామ్సన్ (34) కూడా రాణించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు క్వింటన్ డి కాక్ (65) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించిన డి కాక్, భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే, 11వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా డి కాక్‌ను అవుట్ చేయడంతో సౌతాఫ్రికా పతనం మొదలైంది. ఆ తర్వాత స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ మార్క్రమ్, డోనోవన్ ఫెరీరాలను అవుట్ చేసి సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లాడు.
తర్వాత కూడా తనదైన విధ్వంసక ఆటతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. పాండ్యాకు జతగా తిలక్ వర్మ(73: 42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్) స్వీప్ షాట్లతో హోరెత్తించి అర్ధ శతకం బాదాడు. వీరిద్దరూ పోటీపడుతూ బౌండరీలు బాదేయగా సఫారీ బౌలర్లు నీరుగారిపోయారు. పాండ్యా, తిలక్ మెరుపులతలో 17 ఓవర్లకే స్కోర్ 200 దాటింది. చివరి మూడు ఓవర్లలో 31 రన్స్ రాగా.. సఫారీలకు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా..
సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ డికాక్ (65), బ్రెవిస్ (31) మాత్రమే రాణించారు. ఒకానొక సమయంలో డికాక్ భారత్ ను భయపెట్టాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డికాక్ దంచికొట్టడతో తొలి 10 ఓవర్లలో 118 రన్స్ చేసింది సౌతాఫ్రికా. డికాక్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది…