నూతన గ్రామ సర్పంచ్ గా వంగల స్రవంతి రమేష్..

నూతన గ్రామ సర్పంచ్ గా వంగల స్రవంతి రమేష్

చింతపల్లి మండలం ఉమ్మంతాలపల్లి లో బిజెపి బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా వంగాల స్రవంతి రమేష్ ..

ఉప సర్పంచ్ గా ముదిగొండ మంజుల అలువాలు
మెడ మోని వెంకటమ్మ, ముదిగొండ ప్రశాంత్, ఇంద్రకంటి గోవర్ధన చారి మిగతా వార్డు సభ్యులు ఈరోజు గ్రామపంచాయతీ భవనంలో అధికారులచే గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు…గ్రామ సర్పంచ్ వంగాల స్రవంతి రమేష్ మాట్లాడుతూ గ్రామంలో బొడ్రాయి పండుగ అందరి కులస్తులను కలుపుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆరు మాసాలలో బొడ్రాయి పండుగ ఘనంగా నిర్వహించుకుంటాము , గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాము, స్కూల్లో బెంచిల్లు అవసరం ఉన్నాయని హెడ్మాస్టర్ మాకు తెలియజేసినారు త్వరలో బెంచులు కూడా ఏర్పాటు చేస్తామని గ్రామంలో ఏ సమస్యలున్న నేను తీర్చుతానని గ్రామస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గ్రామస్తుల సమక్షంలో తెలియజేసినారు..