ఘనంగా తీదేడు గ్రామ సర్పంచ్ గా ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..!

ఘనంగా తీదేడు గ్రామ సర్పంచ్ గా ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

గ్రామ అభివృద్ధి కి ప్రతి ఒక్కరు సహాకరించాలి..

భారి విజయోత్సవ ర్యాలీ తీసిన తీదేడు గ్రామ బిఆర్ఎస్ బిజెపి టిడిపి మిత్ర పక్షాల నేతలు
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
తీదేడు గ్రామ సర్పంచ్..

చింతపల్లి…….

చింతపల్లి మండలం తీదేడు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహాకరించాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేసారు‌.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…గ్రామ అభివృద్దికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహాకరించాలని కోరారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పక్షపాతం లేకుండా వ్యవహరిస్తమన్నారు.అనంతరం గ్రామ ప్రజలు సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి గారిని మరియు గ్రామ పాలక వర్గం సభ్యులకు శాలువాలతో పూల మాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం సర్పంచ్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్,గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,ధరణిపతి రమణారావు,సందె లక్ష్మయ్య,మర్ల యాదయ్య యాదవ్,శివర్ల పర్వతాలు యాదవ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.