సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తకుండా పార్టీపై మాత్రమే విమర్శలు..
స్థానిక ఎలక్షన్ అయిపోయిన తర్వాత.. మాజీ సీఎం కేసీఆర్ అటు సోషల్ మీడియాకు..ఇటు బీఆర్ఎస్ క్యాడర్‌కు కావాల్సిన బూస్ట్ ఇచ్చారు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్. నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క అంటూ..సరికొత్త డైలాగులు పేల్చి..కథ వేరే ఉంటదని చెప్పకనే చెప్పారు. ఈక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిని కేసీఆర్ డైరెక్ట్‌గా టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది…రేవంత్ పేరును ప్రస్తావించకుండానే..గట్టిగానే అటాక్ చేశారు కేసీఆర్. రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన కృష్ణా జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సెంట్రిక్‌గా కేసీఆర్ ఇండైరెక్ట్‌గా రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపితే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటూ ఫైరయ్యారు. డీపీఆర్‌ను వెనక్కి పంపితే భూమి, ఆకాశాన్ని ఏకం చేసి లొల్లి చేయాల్సింది పోయి ప్రభుత్వం సైలెంట్‌గా ఉందని పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కేసీఆర్..పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో గ్రామగ్రామాన సభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి తీరుతామ్. పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామ్. బహిరంగ సభలకు తాను స్వయంగా హాజరవుతానంటూ..ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతానని చెప్పకనే చెప్పారు గులాబీ బాస్. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదని రేవంత్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని..అన్యాయాలపై ప్రశ్నిస్తామని హెచ్చరించారు…
సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే ప్రెస్ మీట్.
కనీసం సీఎం పేరు కూడా ఎత్తకుండా.. కేవలం పార్టీ పైన మాత్రమే విమర్శలు గుప్పించిన బిఆర్ఎస్ అధినేత కేసిఆర్… ఘాటైన విమర్శలతో ఒక్కసారిగా ప్రత్యర్థులపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..