తొలి వెలుగు రఘు స్టూడియోకు ఎన్ఐఏ నోటీసులు
మాజీ మావోయిస్టు కట్టా రామచంద్ర రెడ్డి మృతి చెందిన ప్రాంతానికి వెళ్ళి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసినందుకు.. గాదె ఇన్నారెడ్డి అరెస్టుకు కారణాలు అంటూ మరో వీడియో అప్లోడ్ చేసినందుకు NIA నోటీసులు
ఈరోజు గచ్చిబౌలి NIA ఆఫీసులో వివరణ ఇవ్వాలని ఆదేశం..
గతంలో సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు కట్టా రామచంద్ర రెడ్డి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో పాటు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. మావోయిస్టులకు మద్దతుగా ప్రసంగించిన ఆరోపణలపై ఆయనపై యూఏపీఏ కేసు నమోదైంది. ఈ క్రమంలనే ‘తొలి వెలుగు రఘు స్టూడియో’ అప్లోడ్ చేసిన వీడియోలు ఎన్ఐఏ దృష్టికి వచ్చాయి. దీంతో ఆ ఛానెల్ బృందానికి తాజాగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది…