H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పు..

H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పు..

ర్యాండమ్ లాటరీ విధానానికి స్వస్తి పలకనున్న అమెరికా..

నైపుణ్యం, వేతనం ఎక్కువ ఉంటేనే H1B వీసాలు..

హెచ్-1బీ వీసాల జారీ.

ప్రక్రియలో కీలక మార్పు చేపట్టేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతమున్న ర్యాండమ్ లాటరీ విధానానికి స్వస్తి పలికి.. అధిక నైపుణ్యాలు, ఎక్కువ వేతనాలు ఉన్న వ్యక్తులకు ఆ వీసాల జారీలో ప్రాధాన్యమిచ్చే సరికొత్త వ్యవస్థను దాని స్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త పద్దతికి సంబంధించిన నిబంధన వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2027 ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్కు కూడా ఇదే వర్తిస్తుందని వెల్లడించింది. అమెరికా కార్మికుల ఉద్యోగ అవకాశాలతో పాటు పని పరిస్థితులు, వేతనాలను పరిరక్షించేందుకే నూతన నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.

హెచ్-1బీ వీసాల జారీకి ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కంపెనీలు విదేశాల నుంచి తక్కువ వేతనాలకే ఉద్యోగులను రప్పించుకుంటున్నా గుర్తుచేసింది..