లక్ష్మీ నరసింహ స్వామికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు, నిత్య హోమములు.!…

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు ఈ రోజు శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు, నిత్య హోమములు జరిగినవి…

సదరు దేవస్థానం నందు ధనుర్మాసం సందర్భంగా శ్రీమాన్ కుమ్మరికుంట్ల బదరినారాయణాచార్యులు, అర్చకుల వారిచే శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై సేవా* కాలంలో విశేష అర్చనలు నిర్వహించబడును. ధనుర్మాసం మొత్తం కూడా గోదాదేవి అమ్మవారు రచించిన 30 పాశురాలలో ప్రతిరోజు ఒక పాశురం తిరుప్పావై సేవా కాలంలో పాశురాలు మరియు విశేష అర్చనలు నిర్వహించబడుచున్నవి.

తదుపరి *నిత్య కళ్యాణం* దేవాలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, ఫణి భూషణ మంగాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయ చార్యులు వార్లచే శాస్త్రోతముగా నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్ వారలు పాల్గొన్నారు.

ఈ రోజు దేవాలయం అన్నదానంలో 113మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.“

A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959