కర్ల రాజేష్ కుటుంబానికి ఎస్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది..కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

సూర్యాపేట జిల్లా ,
కోదాడ.

కర్ల రాజేష్ కుటుంబానికి ఎస్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన దళిత బిడ్డ రాజేష్ మృతి బాధాకరమని ఇలాంటి సంఘటనలపై ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మృతి చెందిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజేష్ మృతి పై కలెక్టర్ ఎస్పీ సమగ్రమైన దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా రాజేష్ కుటుంబానికి అందజేసేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందన్నారు. సందర్భంగా రాజేష్ తల్లికి 4.12 లక్షల చెక్కును అందజేశారు.

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959