మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ..!

మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ

దండోరా సినిమా ఈవెంట్‌లో మహిళల వేషధారణపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్..

సీనియర్ నటుడు శివాజీ.. ఓ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ‘హీరోయిన్ల వస్త్రధారణ’పై చేసిన కామెంట్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ఈ క్రమంలో శివాజీ సోషల్ మీడియాతో పాటుగా సినీ ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది పర్సన్గా మారారు. ఆయన చేసిన కామెంట్స్ పై ఇండస్ట్రీలో పలువురు భిన్నరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..వస్త్రధారణ అనేది మహిళల హక్కు అని.. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనెవరని.. అనసూయ, చిన్మయి శివాజీ వ్యాఖ్యలను ఖండించడంతో వివాదం మరింత ముదిరింది. శివాజీ మాట్లాడిన భాష, వాడిన పదాలు తప్పేనని.. కానీ ఆయన చేసిన హిత బోధ మంచిదేనని కరాటే కల్యాణి లాంటి కొందరు ఆయనను సమర్థించడంతో టాలీవుడ్లో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది.

ఈ క్రమంలోనే తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు నటుడు శివాజీ ఇవాళ విచారణకు హాజరయ్యారు. శనివారం (2025 డిసెంబర్ 27న) సికింద్రాబాద్ బుద్ధ భవన్లో గల మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు శివాజీ. మరి ఈ విచారణలో శివాజీ ఇచ్చే వివరణపై, కమిషన్ ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది…..

కానీ సోషల్ మీడియాలో భిన్నంగా నటుడు శివాజీకే అనుకూలంగా చాలా మంది మద్దతు తెలపడం విశేషం.. మహిళల భద్రత కోసమే తప్ప తనకి ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా కోపం లేదని వివరణ కూడా ఇచ్చారు..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959