సూర్యాపేట జిల్లా.
గరిడేపల్లి.
కర్ల రాజేష్ కస్టోడియల్ మృతికి కారకులైన వారి అందరినీ విధులు నుంచి తొలగించి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు..
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో గరిడేపల్లి ఎమ్మార్వో ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట జిల్లా ఎం.ఎస్. పి జిల్లా ప్రధాన కార్యదర్శి *ఎడపల్లి చంద్రయ్య మాదిగ.
వారు ఇట్టి రిలే నిరాహార దీక్షలో పాల్గొని, పూలమాలలు వేస్తూ ఈ సంవత్సరం ఇప్పటికే 1635 లాకప్ డెత్ లు జరిగాయని, ఇలాంటివి అన్ని కూడా కుల అహంకారంతోనే జరుగుతున్నాయని, అదే క్రమంలో కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ కస్టర్డ్ మృతికి కారకులైన చిలుకూరు మండల ఎస్సై సురేష్ రెడ్డిని, కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం, కారకులైన పోలీస్ సిబ్బందిని అందరినీ కూడా తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలని, వారిపై మర్డర్ కేసు,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కర్ల రాజేశ్ కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని , లేనిపక్షంలో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, ఇలాంటి చట్ట వ్యతిరేకమైన లాక్ అభ్యర్థులు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చట్టాలు తీసుకురావాలని, కారకులను వెంటనే తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. జనవరి 10న చలో కోదాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా పాల్గొని కోరడం జరిగింది. ఇట్టి రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో గరిడేపల్లి మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు దూరే వినోద్, గ్రామ అధ్యక్షులు పిట్ట వెంకటేష్, అప్పిరెడ్డిగూడెం గ్రామ అధ్యక్షులు రేవురు సాయికిరణ్, మండల ప్రచార కార్యదర్శి ఆలంపల్లి శేఖర్, జై భీమ్గౌడ్ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రవి, లారీ అసోసియేషన్ అధ్యక్షులు పెండ వినోద్, మచ్చ వేణు, సందాల సైదులు, రేవూరి రాము, రేవూరి నగేష్, మొదలైన వారు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959