హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల నిరసన సెగ మరోసారి రాజుకుంది…!!
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం జనవరి మూడో తేదీన తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లందరికీ ఆటో జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, జనవరి 3వ తేదీన ‘ఛలో అసెంబ్లీ’కి ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ (JAC) పిలుపునిచ్చింది…!!
హామీలు నెరవేర్చాలంటూ అసెంబ్లీ ముట్టడి…కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రకటించిన హామీలను నేటికీ నెరవేర్చలేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…!!
ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం దెబ్బతిన్నదని, దానికి ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న ఆర్థిక సాయం, ఇతర సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు…!!
రాష్ట్రవ్యాప్తంగా తరలిరావాలని పిలుపు…!!
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరూ హైదరాబాద్కు తరలివచ్చి అసెంబ్లీని ముట్టడించాలని జేఏసీ పిలుపునిచ్చింది…!!
“మా బతుకులతో ప్రభుత్వం ఆడుకుంటోంది.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తాం” అని ఆటో యూనియన్ నేతలు హెచ్చరించారు…!!
జనవరి 3న అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమవుతున్నారు…!!
వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు…!!