న్యూ ఇయర్ సంబురాల్లో ప్రజలు..

R9TELUGUNEWS.COM తరఫున..Happy New Year

R9TELUGUNEWS.COM తరఫున
మీకు మరియు మీ కుటుంబానికి
ఆనందం, ఆరోగ్యం, విజయాలతో నిండిన
కొత్త సంవత్సరం కావాలని కోరుకుంటున్నాం.

సూర్యోద‌యాలు, సూర్యస్తమ‌యాలు ఒకదాని వెంట ఒకటి నిర్విరామంగా జరుగుతూ.. కాలం ఎవ‌రి కోసం ఆగ‌కుండా ప‌రుగులు పెడుతూనే ఉన్నది. ఈ క్రమంలో ఒక్కో సంవత్సరం వరుసగా వచ్చిపోతున్నాయి..ఇప్పటికే క్రీస్తు శ‌కంలో 2024 సంవ‌త్సరాలు గ‌డిచిపోయాయి. ఇవాళ్టితో 2025వ సంవత్సరం కూడా ముగిసిపోతున్నది. ఒక్కో దేశం వరుసగా కొత్త సంవత్సరంలో కాలుమోపుతున్నాయి. 2026వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. ముందుగా న్యూజిలాండ్‌ నూత‌న సంవ‌త్సరంలో అడుగుపెట్టింది. అక్కడి ప్రజ‌లు సంబురాలు చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఒక్కో దేశం క్రమంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. మరికొన్ని గంటల్లో మ‌నం కూడా న్యూఇయర్‌లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇప్పటికే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన దేశాల్లో సంబురాలు చేసుకోవడం జరిగింది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959