ఇటీవల శ్రీశైలానికి తెలంగాణ నుండి భారీగా భక్తుల సందడి పెరగడంతో, గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది..
హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి మార్గం గుండా వెళుతున్న యాత్రికులకు సూచన, హెచ్చరిక జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..గత ఐదారు రోజుల క్రితం ఒక కుటుంబానికి భయానక చేదు అనుభవం ఎదురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఆ మహిళ వీడియోను విడుదల చేసింది. సహజంగా వీకెండ్ అయిన లేదా ఏదైనా అకేషన్ సందర్భంగా రెండు మూడు రోజులు సెలవు వచ్చిన వేలాది వాహనాలు యాత్రికులు రాష్ట్ర నలుమూలల నుండి శ్రీశైలం మల్లన్న దర్శించుకోవడానికి వెళుతుంటారు.
స్వర్ణగిరి రెడ్డి ఆమెకు సంబంధించిన ఇబ్బందిని ఇన్స్టాల్ గ్రామంలో పోస్ట్ చేసింది..
అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు నుండి గత వారం రోజుల క్రితం ఒక కుటుంబం శ్రీశైలం మల్లన్న దర్శించుకోవడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట ( బ్రహ్మగిరి ) దాటిన తర్వాత నల్లమల అడవి మార్గంలో ఒక కుటుంబం కారులో వెళ్తూ వారిలో ఆ మహిళకు కాస్త అనారోగ్య పరిస్థితులు ఏర్పడడంతో కారును ఆపి ఆ మహిళ వాంతులు చేస్తుండగా అడవిలో నుండి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి చేతులు వెనకాల పెట్టుకొని తన దగ్గరికి వస్తున్న సందర్భంలో వెంటనే ఆ మహిళ గమనించి వారి కారులో ఎక్కి కూర్చున్నది. అప్పటికి అపరిచితుడు కారు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో కారు అద్దాలు వేసుకొని తన భర్తను కారును స్పీడుగా కదిలించమని హెచ్చరించడంతో సురక్షితంగా బయటపడ్డామని ఆ మహిళ ఆ వీడియోలో తెలిపింది. ఆ భయానక వాతావరణ పరిస్థితి నుండి తృటిలో తప్పించుకున్నామని ఒకవేళ గమనించకపోతే ఏం జరిగి ఉండేదో అని ఆందోళన చెందింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
స్వర్ణగిరి రెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది అంతేకాదు కొంతమంది ఆమెకి ఎదురైన అనుభవమే మాకు కూడా ఎదురయిందంటూ కామెంట్స్ పెట్టడంతో ఇటీవల శ్రీశైలం మార్గంలో గుర్తుతెలియని దుండగులు ఎక్కువయ్యారు అనే మాటలకి బలాన్ని చేకూర్చింది..
పోలీసులు, అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టాల్సిఉంది..
శ్రీశైలం జాతీయ రహదారి వెంట నిత్యం వందలాది వాహనాలు వీకెండ్ ఇతర సెలవు దినాలలో వేలాది వాహనాలు వెళుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఏదైనా వాహనం ఒంటరిగా ఆగితే గుర్తుతెలియని అగంతకులు అపరిచితుడు లాంటి వ్యక్తులు ఏదైనా ప్రమాదం సృష్టించే అవకాశం ఉందని ఆ మహిళా చెప్పిన మాటల్లో తెలుస్తుంది. కావున నిత్యం అటవీ శాఖ, పోలీస్ శాఖ నల్లమల్లలోని శ్రీశైలం జాతీయ రహదారి మార్గం గుండా ప్రత్యేక నిగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పై సంఘటన ద్వారా వ్యక్తమౌతుంది. అలాగే యాత్రికులు సైతం ఒంటరిగా తమ వాహనాలను ఆపకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది..
ఒంటరిగా వెళ్తున్నప్పుడు దాదాపు ఘాట్ రోడ్లో రద్దీ ఉండే ప్రదేశాల్లోనే మాత్రం సేద తీరడం మంచిదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959