తమిళనాడులో మొదలైన జల్లికట్టు హడావుడి..!

తమిళనాడులో మొదలైన జల్లికట్టు హడావుడి
తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు హడావుడిగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు పోటీల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు పుదుకొట్టై జిల్లా తట్టంకురుచిలో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి.
జల్లికట్టు పోటీల్లో పాల్గొనే యువకులు మరియు ఎద్దులకు ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య పరీక్షలు పూర్తిచేసిన వారికే పోటీల్లో పాల్గొనే అనుమతి ఇస్తున్నారు.
ఇదే సమయంలో మదురై జిల్లాలోనూ జల్లికట్టు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు, ప్రేక్షకుల నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
జల్లికట్టు ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ క్రీడను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959