దుర్గం చెరువు కబ్జా అంటూ నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం..అదే ప్రాంతంలో నటుడు నందమూరి బాలకృష్ణకు చెందిన భూములు..బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు పూర్తిగా నిరాధారం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుర్గం చెరువు కబ్జాకు సంబంధించిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై కక్ష సాధింపు చర్యగా ఈ కేసును పెట్టారని ఆయన ఆరోపించారు.
దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో తనకు ఎలాంటి భూమి లేదని స్పష్టంగా తెలిపారు. కావాలని తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. అక్కడ తనకు భూమి ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.
అదే ప్రాంతంలో నటుడు నందమూరి బాలకృష్ణకు చెందిన భూములు, అలాగే లహరి ఎస్టేట్ యజమాని హరిబాబు భూములు పక్కనే ఉన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ తనను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపేనని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు..
దుర్గం చెరువు ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు..
ఈ నేపథ్యంలో మాధాపూర్ పోలీసులు భూ ఆక్రమణపై దర్యాప్తు చేపట్టారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు దుర్గం చెరువులో సుమారు ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆక్రమించిన ఐదు ఎకరాల భూమిని ఎస్టీఎస్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు పార్కింగ్కు వినియోగిస్తున్నట్టు హైడ్రా అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. దుర్గం చెరువు కబ్జా అంటూ నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అంటూ పేర్కొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959