పోలీస్ శాఖ నుంచి పదవీ విరమణ పొందిన రాములు నాయక్‌కు సన్మానం.

పోలీస్ శాఖ నుంచి పదవీ విరమణ పొందిన బి. రాములు నాయక్‌కు సన్మానం.

పోలీస్ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా విశిష్ట సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందిన బి. రాములు నాయక్ (ఏఎస్ఐ ఆఫ్ పోలీస్)కు నేడు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు..

సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బి. రాములు నాయక్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో గరిడేపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ కృష్ణ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నట్టే సైదయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959