నిజాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన చోట బాపూ ఘాట్ నిర్మించారు..

మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందింది ..

కాకతీయుల నుంచి నిజాం నవాబుల వరకు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించారు..

1908 లో నగరాన్ని వరద ముంచెత్తితే… వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం సర్కారు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించింది..

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పటికీ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి..

ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌజుల డ్రైనేజీతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లొంకలుపుతుంటే ఉక్కు పాదం మోపాం..

ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాం.

లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలను పర్యటించాం..

ప్రపంచస్థాయి నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయి.

గుజరాత్ సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారు..

ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు.

బీజేపీ నాయకులు వాటిని అభివృద్ధి మంత్రంగా ప్రచారం…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
అసెంబ్లీలో జరుగుతున్న చర్చలకు స్పందిస్తూ, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి..

నార్మల్‌గా సబ్జెక్ట్ లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడరని చాలామంది నేతలు చెబుతుంటారు. శుక్రవారం సభలో సీఎం మాటలు చూసి ఏ ఒక్కరూ నోరెత్తలేకపోయారు. కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని పలువురు సభ్యులకు హితవు పలికారు. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో విషం అత్యంత ప్రమాదకరమైనది వర్ణించారు.

నిజాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ ఆయన సూటిగా నిలదీశారు. నిజాలు తెలియకుండా చూడాలనుకుంటున్నారా? అంటూ వారిపై ఎదురుదాడి మొదలుపెట్టారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకంటూ విపక్ష సభ్యులపై రుసరుసలాడారు…తాను రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారానంటూ కొందరు సభ్యుల చేసిన ఆరోపణలపై అసలు రహస్యం బయటపెట్టారు సీఎం రేవంత్. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ అని, దాన్ని ప్రమోట్ చేసేందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959