సింథటిక్ దారం నిషేధం అమలుపై ఎన్జీఓలు, వాలంటీర్లతో సమావేశం…
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరవేసే పతంగుల వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నట్లు పలు ఎన్జీఓలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారిణి డాక్టర్ సి. సువర్ణ ఆధ్వర్యంలో అరణ్యభవన్లో సింథటిక్ దారం నిషేధం అమలుపై ఎన్జీఓలు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు..
సింథటిక్ దారం వాడకం వల్ల పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో దాని వినియోగంపై విధించిన నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి పక్షులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిషేధం అమలులో ప్రజల భాగస్వామ్యం కీలకమని, విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.
విద్యార్థుల స్థాయి నుంచే పతంగుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖుల సహకారంతో కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ నిషేధం విజయవంతమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడ్మిన్ ఎస్జే ఆశ, సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, క్షితిజ, రంగారెడ్డి జిల్లా డీఎఫ్వో రోహిత్, హైదరాబాద్ డీఎఫ్వో శ్రీనివాస్తో పాటు పలు ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959