సూర్యాపేట జిల్లా:
తుంగతుర్తి మండలం:
తుంగతుర్తి తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా….
అక్రమంగా పట్టా చేసిన తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని రైతుల ఆవేదన….
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో గత కొంతకాలంగా రైతుల ఆధీనంలో ఉన్న భూములను స్థానిక తహశీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రావులపల్లి బాధిత భూముల రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్, సీపీఎం పార్టీ నాయకులు రైతులకు సంఘీభావం వ్యక్తం చేసి పలువురు మాట్లాడారు. గ్రామంలో 25 సంవత్సరాల క్రితం కొన్న భూములు నేడు గ్రామానికి చెందిన సౌజన్య రెడ్డి దౌర్జన్యంతో తమ వద్ద నుండి బెదిరింపులకు గురి చేస్తూ భూముల పట్టా మార్పిడి కార్యక్రమం చేపట్టినట్లు ఆరోపించారు. దీనికి తోడు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు కూడా అక్రమంగా మాపై కేసులు పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు కావాలని, మాపై గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రావులపల్లి గ్రామంలో దళిత రైతులపై జరుగుతున్న సంఘటన పట్ల జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959