వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు…
తాజాగా భారీ పేలుళ్లతో వెనెజువెలా దద్దరిల్లింది. రాజధాని కరాకస్ (Caracas)లో పేలుళ్లు సంభవించాయి. శనివారం తెల్లవారుజామున దాదాపు ఏడు చోట్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతేకాదు, కరాకస్‌పై తక్కువ ఎత్తులో విమానాలు గర్జించాయి. ఈ శబ్దాలతో స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు తీశారు..నికోలస్ మడురో ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వెనిజువెలా చుట్టూ కరేబియన్ సముద్రంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. ఇక మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా టార్గెట్ చేసింది. పసిఫిక్, కరేబీయన్ సముద్రాల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లు, జలాంతర్గాములపై దాడులు చేస్తోంది. ఈ పరిణామాల వేళ తాజా పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం…
వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో దీనిపై స్పందిస్తూ.. మృతులు, గాయపడినవారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. అమెరికా చేసిన దాడులు సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేసినట్లు చెప్పారు.
దాడిని వెనెజువెలా ప్రతిఘటిస్తుందని పాడ్రినో చెప్పడం గమనార్హం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్, ఆయన భార్యను అమెరికా సైన్యం డెల్టా ఫోర్స్ అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.
ఏయే ప్రాంతాల్లో దాడులు?
ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. అమెరికా దాడులు ప్రధానంగా రాజధాని కారకాస్ నగరంతో పాటు మిరాండా, అరాగువా, లా గువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
ఇంతకు ముందు ఏం జరిగింది?
సెప్టెంబర్ ప్రారంభం నుంచి అమెరికా సైన్యం కరీబియన్ సముద్రం తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో షిప్‌లపై దాడులు చేస్తోంది. శుక్రవారం నాటికి నమోదైన ఇలాంటి దాడుల సంఖ్య 35. మరణించినవారి సంఖ్య దాదాపు 115. ఈ గణాంకాలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.
దక్షిణ అమెరికా తీర జలాల్లో అమెరికా దళాలను భారీగా పంపిన తర్వాత ఈ దాడులు జరిగాయి. నవంబర్ నెలలో దేశానికి చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక అక్కడికి చేరుకుంది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959