సూర్యాపేట జిల్లా,
కోదాడ.
స్వలాభం కోసం ఓట్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న నాయకులకు తగిన బుద్ధి చెబుతారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. 50, 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కోదాడ పెద్ద చెరువు సమీపంలో ఉంటున్న 372 మంది నివాసితులకు ట్రిబ్యునల్ గ్రీన్ కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.ఈ సందర్భంగా వారి నివాసాలకు వెళ్లి ఆయన వివరాలు అడిగి పరామర్శించారు. ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ నాయకులు పేద ప్రజలను భయాందోళన గురి చేయడానికి ఇలాంటి నోటీసులు ఇస్తున్నారు అన్నారు. ఎన్నికలప్పుడే పేదలు గుర్తొస్తారని తరువాత వారిని ఇబ్బంది పెట్టే పనులు చేయడం హేయమైన చర్య అన్నారు. 60 సంవత్సరాలుగా పట్టణంలో నివాసం ఉంటూ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకొని నివాసం ఉంటున్న ప్రజలకు నేడు అదే అధికారులు ఎవరి ఒత్తిడితో ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల వత్తిళ్ళకు తలొగ్గి అధికారులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని అన్నారు. సామాన్య ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ నోటీసులపై కోర్టులో ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసు అన్నారు. సామాన్యులకు న్యాయం జరిగే వరకూ వారికి ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959