పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు రోడ్ ప్రమాదంలో మృతి…!

పరీక్ష రాయడానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రమాదంలో మృతి…..

యాదాద్రి భువనగిరి జిల్లా..
వలిగొండ మండలం నరసాపురం గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. మోత్కూర్ మండలం దత్తప్పగూడెంకి చెందిన కుక్కల సాయి,అదే మండలం దాచారం గ్రామానికి చెందిన బోల్ల దీక్షిత్ ఇద్దరు స్నేహితులు..ఈ రోజు ఉదయం భువనగిరిలో జరుగుతున్న ఓ పోటీ పరీక్ష రాయడానికి ఇద్దరు దీక్షిత్ కి చెందిన పల్సర్ బైక్ పై బయలుదేరారు.ఈ క్రమం లో వలిగొండ మండలం నరసాపురం గ్రామ శివారులోకి రాగానే ముందుగా స్టీలు లోడుతో వెళుతున్న భారీ లారీని ఓవర్ టేక్ చేసే క్రమం లో ప్రమాదవశాత్తు లారీ వెనక టైర్ల కింద పడి ఆక్కడికక్కడే మృతి చెందారు..ఇద్దరి మృతదేహాలు లారీ టైర్ల కింద ఇరుక్కుపోవడంతో అతి కష్టం మీద పోలీసులు స్థానికుల సహాయం తో బయటకు తీశారు.ఇద్దరి యువకుల మృతదేహాలు మొత్తం చిద్ర కావడంతో మృతదేహాల్ని అత్యంత శ్రమించి బయటకు తీయాల్సి వచ్చింది.. ..
యువకుల ఇద్దరు కుక్కల సాయి,బోల్ల దీక్షిత్ ఇద్దరు కూడా తమ తల్లిదండ్రులకు ఒక్కరే..దీక్షిత్ తండ్రి 3 సంవత్సరాల క్రితం పిడుగు పడి చనిపోయాడు.. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా రోడ్డు ప్రమాదం లో చనిపోవడం తో ఆ కుటుంబం శోక సముద్రం లో మునిగిపోయింది..సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు……

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959