వారణాసి’ థియేటర్స్‌లోకి అడుగు పెట్టే డేట్ ఫిక్స్ ..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్‌లో ఉహించలేని క్రేజ్ సృష్టిస్తోంది. కేఎల్ నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. పూర్తి IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించిన ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. పారిస్‌లో టీజర్ ప్రదర్శన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే గుర్తింపు పొందిన ‘వారణాసి’కు అభిమానుల ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది..

తాజాగా, ఈ విజువల్ వండర్ ఏప్రిల్ 9, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని థియేటర్ రిలీజ్ కోసం ఎంచుకోవడం ద్వారా లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ను కూడా అందించాలనేదే రాజమౌళి మాస్టర్ ప్లాన్. ఈ డేట్ అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉత్సాహానికి చివరి లేదు. ఏప్రిల్ 2027లో ‘వారణాసి’ థియేటర్స్‌లోకి అడుగు పెట్టిన వెంటనే, వసూళ్లలో సునామీ సృష్టించబోతోంది అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959