తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో ఇవాళ ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్)’ పాలసీపై సభలో చర్చ జరగనుంది. హైదరాబాద్ నగరంలో 50-60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా, కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. . అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తుంది. నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన జీఎస్టీ సవరణ బిల్లులు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను మండలిలో ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్టనుంది. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఇవాళ జరిగే శాసన సభ సమావేశాలను ..
. ప్రజల్లో నెలకొన్న అపోహలను తలొగించాలనే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడం అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తుంది. అదే విధంగా శానమండలిలో పలు బిల్లులపై సభ్యులు చర్చించనున్నారు. మరో వైపు తెలంగాణ భవన్ లో సమాంతర అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అసెంబ్లీలో జరిగే చర్చలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వనున్నది..
అసెంబ్లీలో ఓవైసీ వర్సెస్ మహేశ్వర్ రెడ్డి.
బిహార్, బెంగాల్లో మైనార్టీ ఓట్లు తొలగిస్తునారన్న..
ఓవైసీ మాటలను తప్పు బట్టిన ఏలేటి.
ఓవైసీ SIR మీద ఇష్టారాజ్యంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు ఆపడం లేదని ఏలేటి ప్రశ్న.
MIM వాళ్లు మాట్లాడితే మైక్ కట్ చేయరు,
మేము మాట్లాడితే చేస్తారు, ఇదెక్కడి న్యాయమని ఆందోళన..
SIR ద్వారా బిహార్ లో 50లక్షల ఓట్లు తొలగించారు.బిహార్, యూపీ కాదు దేశం మొత్తం SIR తెస్తున్నార
హిందూ – ముస్లిం అని తారతమ్యం చేస్తున్నారు: ఓవైసీ.
బీఆర్ఎస్, బీజేపీకి రహస్య అనుబంధం ఉంది: మంత్రి శ్రీధర్‌బాబు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారం నమ్మకుండా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారు
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు..హిల్ట్‌పాలసీ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడతాం మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించాం-మంత్రి సీతక్క.
తాగునీటి వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలి
వేసవిలో తాగు నీటి కొరత లేకుండా చూడాలి
ఎప్పటికప్పుడు నీటి నిల్వలు అంచనా వేయాలి-.
ఈనెల 10న మేడారంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశం.
జాతర సమయంలో తాగునీటి సరఫరాపై నిర్ణయం-సీతక్క..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959