టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు..

టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు..

టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జి..

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు..

అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా, అందుకు నిరాకరించిన హైకోర్టు..

ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేయనున్న హైకోర్టు.

టిక్కెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రెండు చిత్రాల నిర్మాతలు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరారు. టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా, కోర్టు అందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

కాగా, ‘రాజాసాబ్’ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగా (జనవరి 8) రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇవ్వాలని కోరింది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959